డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నాసిరకంగా ఇళ్లు నిర్మిస్తోందని ప్రభుత్వంపై ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. దానికి నిదర్శనమే తాజా ఘటన. మొన్నటి వర్షాలకు కేసీఆర్ పుణ్యమా అని ఇళ్లలోనే జలపాతాల్ని చూసిన జనం.. ఈసారి కళ్లముందే గోడలు కూలిపోవడాన్ని చూశారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం గజ్వేల్ కు సమీపంలోనే ఈ ఘటన జరిగింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు సమీపంలో మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించింది. వాటిలో పల్లెపహడ్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కు కేటాయించిన ఇల్లు చిన్న వానకే తడిసి లోపలి గోడలు కూలిపోయాయి. ఇంట్లో ఉన్నవారు ముందుగానే బయటకు పరిగెత్తడంతో ప్రమాదం తప్పింది.
మొన్నటి వానలకు ఇళ్లల్లో నీరు కారడంతో ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఇప్పుడు ఏకంగా గోడలు కూలిపోతుండడంతో భయంభయంగా గడుపుతున్నారు. ఇంకా వానలు పడుతుండడంతో ఎప్పుడు ఏ ఇల్లు కూలుతుందోనని ఆందోళన చెందుతున్నారు.