సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ అంటున్న భగ్గున లేచేది. దుబ్బాక ఉప ఎన్నికల్లో మొదలైన ఈ ఆధిపత్య పోరు జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ కీలక నేతలు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీపై టీఆర్ఎస్ ఫైర్ అయ్యింది. ఇక రైతులు ఇచ్చిన భారత్ బంద్ కు సంపూర్ణ బంద్ ప్రకటిస్తూ, బీజేపీపై ఇక యుద్ధమేనని ప్రకటించింది. టీఆర్ఎస్ నేతలంతా రోడ్లపైకి వచ్చి తమ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కాదు బీజేపీయేనన్న విధంగా మాటల దాడి చేశారు.
కానీ, సీఎం కేసీఆర్ అత్యవసరంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లటంతో అంతా కామ్ అయిపోయింది. కేసీఆర్ బీజేపీ అగ్రనేతలతో వరుస భేటీల తర్వాత టీఆర్ఎస్ వెనక్కి తగ్గింది. కేసీఆర్, కేటీఆర్ వంటి నేతలు బీజేపీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయెటం లేదు సరికదా… డిసెంబర్ రెండో వారంలో జాతీయ రాజకీయాలపై దృష్టిపెడతామని… ఓ సెమినార్ నిర్వహిస్తామంటూ కేసీఆర్ చేసిన ప్రకటన కూడా అటకెక్కింది.
తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎంత థర్డ్ ఫ్రంట్ అంటూ మొత్తకున్నా దేశంలోని కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు కేసీఆర్ ను నమ్మటం లేదని వ్యాఖ్యానించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అధికారుల డిప్యూటేషన్ పై జరుగుతున్న పోరులో కేసీఆర్ ను పక్కనపెట్టేశారు. శరద్ పవార్ వంటి నేతలకు సైతం ధన్యవాదాలు చెప్పారు. కేసీఆర్ కూడా ఆమెకు మద్ధతుగా నిలిచేందుకు సాహసం చేయలేకపోయినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవన్నీ ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్స్ అంటూ స్పష్టం చేస్తున్నారు.