హిమాన్ష్‌రావు… సీఎం కేసీఆర్ మనువడు కావటంతో హిమాన్ష్ ఏం చేసినా వార్తే. పైగా సీఎం కేసీఆర్ హిమాన్ష్‌పై ఎక్కువ ప్రేమ చూపిస్తారు. అందుకే పొలిటికల్ మీటింగ్‌లకు కూడా తన వెంట తీసుకెళ్తుంటాడు. హిమాన్ష్ కూడా అధికారాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ… ఆ మధ్య తన ఫ్రెండ్స్‌తో సచివాలయంలో కలియతిరిగి వచ్చాడు. ప్రతిపక్షాలు తాత రాలేకపోతున్నాడని.. మనువన్ని పంపాడా అంటూ విమర్శలు కూడా చేశాయి.
తాజాగా హిమాన్ష్ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఇంటర్వ్యూ చేసి… ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. స్కూల్ ప్రాజెక్ట్ విషయంలో… మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఇంటర్వ్యూ చేశానని, తెలంగాణలో బాలల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, పథకాలపై చర్చించినట్లు తెలిపారు.
ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది.