కార్మికులు విధుల్లోకి... కేసీఆర్ గ్రీన్‌ సిగ్నల్ ? - Tolivelugu

కార్మికులు విధుల్లోకి… కేసీఆర్ గ్రీన్‌ సిగ్నల్ ?

CM KCR Holds Cabinet Meeting Over RTC Issue, కార్మికులు విధుల్లోకి… కేసీఆర్ గ్రీన్‌ సిగ్నల్ ?

ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకునేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నారా…? అంటే సానుకూల స్పందన వచ్చేలాగే కనపడుతోంది. మద్యాహ్నం 2గంటల నుండి మొదలు కాబోయే క్యాబినెట్ మీటింగ్‌లో సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కల్వకుంట్ల పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ

ఆర్టీసీ సమ్మె అంశం ఇప్పటికే ప్రజల్లోకి పూర్తిగా వెళ్లిపోయింది. ఇటు బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టిలో కూడా ఉంది. ఇలాంటి సమయంలో 50వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు కలిపి దాదాపు 2లక్షల మందికి కేసీఆర్ అన్యాయం చేస్తారని అనుకోవటం లేదని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆర్టీసి సమ్మె పై పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి..

ఇప్పటికే మంత్రులు కూడా ఆర్టీసీ ఇష్యూకు పుల్‌స్టాప్ పెడితేనే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు. పైగా మీరు చెప్పినట్లు వింటాం అని కార్మికులు దిగివచ్చిన నేపథ్యంలో… సీఎం కేసీఆర్‌ సానుకూల స్పందిస్తారని వారు ఆశిస్తున్నారు. కేసీఆర్ మొండిగా ఉంటారు.. అంతే ప్రేమ కూడా చూపించి… తిట్టిన నోటితోనే పొగిడించుకుంటారు. గతంలో ఆశ వర్కర్లు ఇంతకన్నా ఎక్కువ తిట్టిన వారికే జీతాలు పెంచిన విషయాన్ని మర్చిపోవద్దు అంటూ కొందరు మంత్రులు సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ ఐఏఎస్ ఆఫీసర్ కు 28 ఏళ్లలో 53 వ ట్రాన్స్‌ఫర్‌..!

అయితే, సీఎం కేసీఆర్ ఆర్టీసీపై ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. అధికారులతో గంటల కొద్ది మంతనాలు జరిగాయి. ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎక్కడ సానుకూల వాతావరణం ఉందనే అంశం సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు. కేవలం మంత్రుల అభిప్రాయం తీసుకొవడానికే ఈ మీటింగా…? లేక విషయం వారికి కూడా చెప్పి… కఠినంగా ఉండేందుకే మొగ్గుచూపుతారా…? ప్రజల్లోకి మీరు వెళ్లండి… ఎందుకు కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందో అని చెప్తారా…? అని కొంతమంది మంత్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రెచ్చిపోయిన రెవెన్యూ ఉద్యోగి

మరికొద్ది గంటల్లో… నిర్ణయం వెలువడే అవకాశం ఉండటంతో… కార్మికుల్లో ఉన్న టెన్షన్ ఇటు టీఆరెఎస్‌ నేతల్లోనూ కనపడుతోంది. సీఎం కేసీఆర్ పాలభిషేకాలు చేయించుకుంటారో, మమ్మల్ని ఊర్లలోకి రాకుండా శాపనార్ధాలు పెట్టిస్తారో అంటూ ఓ నేత కామెంట్ చేస్తుండటం గమనార్హం.

ఆర్టీసీపై కేసీఆర్‌ ఆటలకు గడ్కరీ చెక్!

ఒకప్పుడు మహిళలు బాగానే ఉండేవారు, ఫోన్లు వచ్చాకే..

Share on facebook
Share on twitter
Share on whatsapp