సీఎం కేసీఆర్ కుక ఏమైంది…? ఆయన ఇంకా అనారోగ్యంగానే ఉన్నారా…? ఎప్పుడూ లేని విధంగా 13రోజుల పాటు ఫాంహౌజ్ కే కేసీఆర్ ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది?
ఇప్పుడివే ప్రశ్నలు టీఆర్ఎస్ వర్గాల్లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీ వెళ్లారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ నుండి వస్తూనే 50వేల ఉద్యోగాలకు రెడీ చేయండి అంటూ ఆదేశాలిచ్చారు. ధరణిపై ఉన్నతస్థాయి మీటింగ్ ఏర్పాటు చేసినా ముందురోజే ఫాంహౌజ్ కు వెళ్లిపోరారు. ఈ నెల 13న సాయంత్రం ఫాంహౌజ్ వెళ్లిపోయిన కేసీఆర్ 13రోజుల పాటు అక్కడే ఉన్నారు. కేసీఆర్ ఫాంహౌజ్ లో ఉన్నా… కొందరు కీలక అధికారులు అక్కడికి వెళ్తుంటారు. పనులు జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం అధికారులు కూడా ఎవరూ ఫాంహౌజ్ కు రమ్మని పిలుపు అందనట్లు ప్రచారం సాగుతుంది. అత్యవసరం అయిన విషయాలుంటే కేవలం ఫోన్ ద్వారా మాత్రమే ఆదేశాలు అందినట్లు సచివాలయ వర్గాలంటున్నాయి.
మామలుగా అయితే కేసీఆర్ ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది ఎవరికి తెలిసేది కాదు. కానీ కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నారని ఆయన క్యాబినెట్ మంత్రే భయటపెట్టారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రి గడ్కరీ ఆకాంక్షించారు. అప్పుడు కానీ కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నట్లు భయట పడలేదు.
కానీ ఈ 13 రోజుల పాటు కేసీఆర్ ఫాంహౌజ్ లోనే చికిత్స తీసుకున్నారా…? లేదా ఆయన ఫాంహౌజ్ లో సెల్ఫ్ క్వారెంటైన్ అయ్యారా…? కేటీఆర్ ను సీఎం చేస్తారన్న ప్రచారం సమయంలో కేసీఆర్ ఫాంహౌజ్ లో ఉండటం దేనికి సంకేతం అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.