కీలకమైన జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో సేవలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ ఈ మెట్రో సేవలను ప్రారంభించి… మెట్రో ప్రయాణించారు. దాదాపు 11కి.మీ ఈ రూట్‌తో దేశంలోనే అతిపెద్ద రెండో మెట్రో రైల్ సేవలు అందిస్తోన్న నగరంగా హైదారాబాద్ మెట్రో ఘనత సాధించింది.

జేబీఎస్-ఎంజీబీఎస్ మధ్య మొత్తం 9 స్టేషన్లు అందుబాటులో ఉండనున్నాయి. సికింద్రాబాద్, ముషీరాబాద్, నారాయణగూడ మీదుగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త రూట్‌తో హైదరాబాద్ మెట్రో 69కి.మీ పూర్తి చేసుకున్నట్లు సంస్థ ప్రకటించింది.