గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేసీఆర్.. అన్ని రంగాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని.. తాగు, సాగు నీరు, విద్యుత్ సమస్యలు దూరమయ్యాయని చెప్పారు.
పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థ దిశగా రాష్ట్ర అడుగులు పడుతున్నాయన్న కేసీఆర్.. కరోనాతో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 37 వేల 632 రూపాయలకు చేరుకుందని వివరించారు.
ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లోని సైనిక వీరుల స్మారకం దగ్గర పుష్పగుచ్ఛం సమర్పించి అమరవీరులకు నివాళులర్పించారు కేసీఆర్. అంతకుముందు ప్రగతి భవన్ లోనూ జాతీయ జెండా ఎగురవేశారు.