దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత సీఎం కేసీఆర్ సచివాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే పాత సచివాలయాన్ని కూల్చి, కొత్త సచివాలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన సచివాలయ పనులను కేసీఆర్ పరిశీలించారు.
ప్రతి బ్లాక్ నిర్మాణాన్ని పరిశీలించి, నిర్మాణ పనుల్లో నిమగ్నమైవున్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిధులతో మాట్లాడారు.
నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సెక్రటేరియట్ ప్రధాన గేట్ తో పాటు,ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలతో సహా, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని కలియ తిరగారు. డిజైన్లను పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు.
సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ఉన్నతాధికారులు, పలువురు ఎమ్మెల్యేలున్నారు.