ఆర్టీసీ కార్మికులపై పోలీస్‌ చర్య - Tolivelugu

ఆర్టీసీ కార్మికులపై పోలీస్‌ చర్య

ఆర్టీసీ కార్మికులపై పోలీస్‌ చర్యలు మొదలవుతున్నాయా…? కేసులు పెట్టించి, జైల్లకు పంపేందుకు ప్రభుత్వం రెడీ అయిపోయిందా…? సమ్మెపై రగిలిపోతున్న కేసీఆర్… మూడు రోజుల గడువెందుకు ఇచ్చారు…?

ఆర్టీసీ కార్మికులు తన ఆదేశాలు కాదని, ప్రతిపక్షాలతో చేతులు కలిపి… తనపై విమర్శలు చేయడాన్ని సీఎం కేసీఆర్ సహించలేకపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించటంతో… రాబోయే మూడు రోజుల్లో ఏం చేయాలి, ఎవరు ఏ పనిచేయాలో అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పోలీస్‌బాస్ మహేందర్‌రెడ్డికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్‌… మూడు రోజుల్లో బస్సులు మొత్తం రోడ్ల మీద ఉండాల్సిందే. అడ్డుకున్న వారిపై కేసులు పెట్టండి, ప్రతి డిపో దగ్గర పోలీస్‌ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేయండి… అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపండి అని ఆదేశించినట్లు ప్రగతి భవన్‌ వర్గాలు తెలిపాయి.

మూడు రోజుల్లో బస్సులన్నీ రోడ్లమీద ఉండాల్సిందేనని, అందుకు కావాల్సిన తాత్కాలిక ఏర్పాట్లన్నీ… పూర్తిచేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు.

అయితే, ఈనెల 15న హైకోర్ట్‌లో ఆర్టీసీ సమ్మెపై వాదనలు ఉన్న నేపథ్యంలో, ఇప్పటికే ప్రభుత్వ చర్యలపై కోర్ట్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో… కోర్ట్‌ గడువులోపే కేసీఆర్ పోలీస్‌ చర్యను ప్రారంభించటం చర్చనీయాంశం అవుతోంది.

మరీ అరెస్ట్‌లపై ప్రతిపక్షాలు, ఆర్టీసీ కార్మికులు… ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Share on facebook
Share on twitter
Share on whatsapp