గ్రామాల్లో ఇకపై ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించబోమని, వారి నుంచి కొనుగోళ్లు చేసి ప్రభుత్వం నష్టపోదల్చుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మైక్‌పడితే రైతుల గురించే మాట్లాడే కేసీఆర్.. ఇప్పుడు అంత నిర్దయంగా మాట్లాడటమేంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక వేళ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఇటీవల చేసిన సూచనలని ఏమైనా కేసీఆర్ ఫాలో అవుతున్నారా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
మహబూబ్‌నగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లక్ష్మారెడ్డి.. ప్రజలు మరిచిపోయే స్వభావం కలవారని.. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నా వారికి గుర్తుండటం లేదని ఆక్షేపించారు. కొన్నాళ్లు సంక్షేమ పథకాలు నిలపివేసి.. ఏడాది ముందు మళ్లీ అమలు చేస్తే వారికి తెలిసొస్తుందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఈ విషయాన్ని కేసీఆర్ చెవిన వేస్తానని కూడా సభాముఖంగా సెలవిచ్చారు. దీంతో కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై చేసిన ప్రకటనకు.. లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏమైనా సంబంధం ఉందా అని కొందరు చర్చించుకుంటున్నారు. రైతులకు ప్రభుత్వం విలువ తెలియాలని ఇలా టెస్ట్ ఏమైనా చేస్తున్నారేమో అని మాట్లాడుకుంటున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవారిని . దారికి తెచ్చుకోవడంలో కేసీఆర్ కాస్త డిఫరెంట్‌గా ఉంటారు. బాధితులు ప్రభుత్వానికి శాపాలు పెట్టి, శోకాలు పెట్టి అలసిపోయేదాకా ఆందోళన చేసే వరకూ ఆగి.. తిరిగ్గా వారిని దగ్గరకు తీసుకుంటారు. చివరికి వారి నుంచి లాక్కున్నది వారికే ఇచ్చి.. సంతోషపెడతారు. ఆర్టీసీ కార్మికులు వేతలనాల పెంపు కోసం చేసిన సమ్మెనే ఇందుకు ఓ ఉదాహరణ. రైతుల విషయంలోనూ ఇదే స్ట్రాటజీ అమలు చేస్తారేమో మరి.