సీఎం కేసీఆర్ లైవ్ పాయింట్స్…
- దెబ్బతిన్న రోడ్ల కోసం 571 కోట్లతో మరమ్మత్తులు
- దాన్యం కొనుగోలుపై పటిష్టమైన కార్యాచరణ
- సూర్యాపేట జిల్లాలో 2.70లక్షల ఎకరాలకు నీరు
- దేవాదుల, సీతారామ ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి.
- త్వరలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తా
- పత్తి రైతుల సమస్యలపై చర్చించాం
- మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన రైతుల కోసం పాలసీ రూపొందిస్తాం
- ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రంపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకున్నాం… అదే ఎక్కువ సేపు చర్చించాం
- 7000 కోట్ల గ్యారంటీ ధాన్యం కొనుగోలుకు ఇచ్చాం. మరో 4వేల కోట్లు ఇచ్చేందుకు రెడీ
- ఎమ్మెల్యేలకు ప్రాఫిటి ఆఫ్ జాబ్ లేకుండా ఉండేందుకు 28 కార్పోరేషన్ల కోసం ఆర్డినెన్స్
- 100శాతం నూతన రెవెన్యూ చట్టం తెస్తాం
- ఆర్టీసీకి ముగింపుకు నిర్ణయం
- ఎవరి పొట్టలు కొట్టం… ప్రజల పొట్టలు నింపుతాం. అదే ఇప్పటి వరకు చేశాం
- అంగన్ వాడీ, ట్రాఫిక్ అలవెన్స్ కానిస్టేబుల్లకు ఇస్తున్నాం.. దేశంలో ఎక్కడా లేదు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు పెన్షన్ లేదు
- ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటల నమ్మి చెడిపోయారు.
- అనాలోచిత సమ్మె… దీనికి యూనియన్లదే బాధ్యత
- పనికి మాలిన రాజకీయ నాయకులు ఇది చేయించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు దేశంలో ఎక్కడా విలీనం చేయలేదు
- రెండు నెలల జీతాలు పోయేలా చేసింది ప్రతిపక్షాలు, యూనియన్లే. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు… ప్రతిపక్షాలు నిజాలు చెప్పాలి.ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు అని నేను చెప్తే వినలేదు
- వారు ఇల్లీగల్ సమ్మెలో ఉన్నారు. ఏ కోర్టు చెప్పాల్సిన అవసరం లేదు.
- మన రాష్ట్ర చీఫ్ జస్టిస్ కూడా పాపం… కన్‌సర్న్ చూపారు. బాధ్యత యూనియన్లదే.బతుకులు పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది… ఏం అవసరం… ప్రైవేటీకరిస్తున్నాం అని విచిత్ర వితండ వాదన
- ప్రైవేటీకరణ చేయవచ్చని చెప్పే చట్టానికి మీ బీజేపీ ఎంపీలు ఓటేయలేదా…?
- కేంద్రం వాటా మీద కోర్టుకు వెళ్తాం… ఒక్క రూపాయి కేంద్రం ఇచ్చింది లేదు. 22వేల కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి.
- 500 కోట్లైనా బీజేపీ నాయకులు కేంద్రం నుండి తెస్తారా…?
- బతుకుతే బతుకుతరు… చస్తే చస్తారు అని మంత్రులు ఒక్క చాన్స్ ఇద్దామని మంత్రులు కోరారు
- కార్మికులంతా రేపు ఉదయం హ్యపీగా జాయిన్ కండి
- తెల్లవారి సరికి 100కోట్లు ఆర్టీసీకి ఇస్తున్నాం
- కార్మికులు మన బిడ్డలు… రూపాయి చార్జీలు పెంచలేదు. కానీ ఇప్పుడు కిలోమీటరుకు 20పైసలు చార్జీలు పెంచుతాం
- సోమవారం నుండి పెరిగిన చార్జీలు… తద్వారా 750కోట్లు సమకూరుతాయి
- దీన్ని అలుసుగా తీసుకోవద్దు… బస్సులు ప్రైవేటుకు ఇచ్చే ఆలోచన లేదు.ఒక వేళ ఇవ్వాల్సి వస్తే…పెట్టుబడిదారులకు ,షావుకారులకు ఇవ్వం… వీఆరెస్ తీసుకున్న కార్మికులకు ఇస్తాం…
- మిమ్మల్ని కాపాడే ఉద్దేశం ఉంది… 5 రోజుల్లో ఢిల్లీకి వెళ్లి, ప్రధానిని కలుస్తా
- ప్రతి డిపోకు 5గురు కార్మికులను పిలిచి వారంలో మాట్లాడుతా… వాస్తవాలు తెలుసుకుంటా… ప్రగతిభవన్‌లోనే మీటింగ్
- ప్రతి కార్మికునికి ఆన్ పేపర్ వాస్తవాలను తెలియజేస్తాం… మీకు కూడా ఆర్టీసీ అప్పులు-ఆస్తులు తెలవాలి
- యూనియన్లకు కాలం చెల్లినట్లే..
- చనిపోయిన కార్మికుని ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగం
- చిల్లరగాళ్ల మాటలు పట్టించుకోం
- క్రమశిక్షణతో ఉంటే… సింగరేణిలా బోనస్ తెప్పించే బాధ్యత నాది. నేను చెప్పిన మాట వినాలి.యూనియన్ లేకపోతే ఎట్లా… అంటే నేను ఓ మాట చెప్తా. మీకు వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్ పెట్టండి… మంత్రిని ఇంచార్జీని పెడతం, యాజమాన్యం వేధించకుండా చూస్తాం
- సంస్థ బ్రతుకుతేనే మీరు బ్రతుకుతరు… అది తెలియాలనే కఠినంగా ఉన్నాం…నేను రవాణా మంత్రిగా మీ కష్టాలు చూసినాం
- యూనియన్ల మాట విని మీ బ్రతుకులు నా
- శనం చేసుకోవద్దు… యూనియన్లు నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లే
- తాత్కాలిక ఉద్యోగులకు ధన్యవాదాలు… ఇక మీకు సెలవు
- ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తాం
- నా మాట వింటే లాభాలు… యూనియన్ల మాట వింటే బజారు పాలు