తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై విశ్వాసం పోయిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బోరబండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ముస్లింలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్ కేసీఆర్ ఎందుకివ్వలేదని నిలదీశారు. అగ్రవర్ణ పేదలకు మోడీ 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. నిన్నటి సభలో సీఎం కేసీఆర్ పాత స్పీచ్‌నే మళ్లీ చదివారని ఎంపీ అరవింద్ విమర్శించారు.
కేంద్రం తీసుకొస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేయకుండా ఏం చేశారని మళ్లీ వారే ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు.