గులాబీకి గుచ్చుకున్న జగనన్న బాణం
– ఆప్తమిత్రుడా… బద్ధ శతృవా…!
– జగన్ మీద దొరవారి కోపానికి కారణమేంటి…!
– దోస్త్ మేరా దోస్త్ ..కాస్తా దుష్మనీ ఎందుకయ్యింది..!
– కేసీఆర్ కు ….జగన్ కు… ఎక్కడ చెడింది…!
కేసీఆర్ ఎప్పుడు ఎవరిమీద కోపం తెచ్చుకుంటారో ఎవరికీ తెలియదు. కోపం వస్తే మాత్రం పూర్తి ఫోకస్ పెడతారు. ఎదుటి వ్యక్తి నాశనం కావాలని శపిస్తారు. పార్టీ శ్రేణులను, అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తారు.
మొన్న రేవంత్ రెడ్డి, నిన్న ఈటెల రాజేందర్ పై గురిపెట్టిన కేసీఆర్… ప్రస్తుతం ఆప్తమిత్రుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మూడో కన్ను తెరిచారు.
కేసీఆర్ సాధారణంగా ఎవరైనా తిడితే పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ మధ్య… ఎక్కువకాలం ఫాంహౌజ్ లోనే గడిపినందుకో ఏమో…! సారు బాగా సెన్సిటివ్ అయినట్టు కనిపిస్తోంది. జగనన్న బాణం షర్మిల తిట్టే తిట్లు సున్నితమైన దొరవారి హృదయాన్ని బాగా గాయపరిచాయని ఆయన అనుచరులు చెప్తున్నారు.
చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి తెలంగాణలో కుంపటి పెట్టిన కోపంతో జగన్ ని కేసీఆర్ అధికారంలోకి తెచ్చారని, అయితే అణిగిమణిగి ఉండాల్సిన జగన్ తోక జాడించడం మొదలుపెట్టారని ప్రగతి భవన్ వర్గాలు చెపుతున్నాయి. జగన్ వైఖరి సారుకు బాగా కోపం తెప్పించిందనీ, ఇక “ఆపరేషన్ జగన్” తప్పదని ఆ వర్గాలు అంటున్నాయి.
మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా…? దానికీ ప్రగతి భవన్ దగ్గర ఓ అద్భుతమైన సొల్యూషన్ వుంది. జగన్ కనుక ఏదో ఒక బహిరంగ స్థలంలో సారువారికి పాదాభివందనం చేసి.. అది మీడియాలో వస్తే గానీ ఆగ్రహం చల్లబడదని వారు సూచిస్తున్నారు.
షర్మిల మాటల తూటాలు
– ఉద్యోగాలు ఇవ్వనందుకు కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి
– బంగారు తెలంగాణ అంటే.. భూములిచ్చిన రైతుల బలియేనా?
– అన్నదాత కన్నీరు… నీకు దున్నపోతు మీద వానలా వుంది
– ఎకరాకు కోటి సంపాదించే పెద్దరైతువు… వర్షాలు రాకుముందే పంట
కొనాలని తెలీదా కేసీఆర్…?
– కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీపై నిద్రపోతున్నారా కేసీఆర్?
– ఇక ఫీజుల దోపిడీకి స్కూల్స్ తెరుస్తున్నవా దొరా..?
– థర్డ్ వేవ్ అశ్రద్ధ చేసి బడి పిల్లల్ని బలిస్తావా కేసీఆర్…?
– 3 లక్షల డబుల్ బెడ్ రూమ్స్ అన్నావ్..లక్ష కూడా కట్టలే
– పేదలకు ఇండ్లివ్వాలంటే …మళ్లీ ఎన్నికలు రావాలా దొరా..?
– నిరుద్యోగ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలు కావా సారూ..?
తిట్టిన తిట్టు తిట్టని.. ప్రశాంత్ రెడ్డి
Advertisements
– లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే.. ఆంధ్రోళ్లు తెలంగాణ వ్యతిరేకులే
– రాజశేఖర్ రెడ్డి నీటి దొంగ.. జగన్ మోహన్ రెడ్డి గజదొంగ
– జగన్ ను మూర్ఖుడని వాళ్లింటి వాళ్లే అంటారు
– తండ్రి శవం ముందే సంతకాలు సేకరించాడు
– ఆంధ్రోళ్లు ఎన్నడూ తెలంగాణ మేలు కోరరు
– ప్రాజెక్టులను దొంగతనంగా నిర్మిస్తున్నారు
– తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలి
– మీ ఎత్తులు చిత్తు చేస్తాం.. సీమ ప్రాజెక్టులను అడ్డుకుంటాం