ఈ నెల 18న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని.. ధాన్యం కొనుగోళ్లపైనా పోరాడాలని ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు సీఎం. రైతులు, మిల్లర్లు ఇబ్బందులు పడుతున్న తీరును ఎండగట్టేలని చెప్పారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై నిలదీయాలని ఎంపీలకు పిలుపునిచ్చారు కేసీఆర్.
ఇటు తెలంగాణ సమస్యలతోపాటు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంతో ఏర్పడ్డ సమస్యలపైనా నినదించాలనేది కేసీఆర్ ప్లాన్. ఈ పార్లమెంట్ సమావేశాల సమయంలో కేంద్రంపై పోరాటానికి కలసి రావాలని వివిధ రాష్ట్రాల సీఎంలు, నేతలకు ఫోన్లు కూడా చేశారు.