2023 ఉన్నికలకు కేసీఆర్ అలర్ట్
రానున్న ఎన్నికలకు ఇప్పటినుండే కసరత్తు
ఓటమి భయంతో పీకే తో చర్చలు
రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చ
పీకేతో ఒప్పందానికి కేసీఆర్, కేటీఆర్ లు ప్రయత్నం
చర్చలు ఫలిస్తే ముందస్తు ఎన్నికలు..?
ఏం జరుగుతుందనేది వేచి చూడాల్పిందే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలతో ముచ్చటగా మూడోసారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయ పతాకం ఎగురవేయాలని టీఆర్ఎస్ భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్.. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తో చర్చలు కూడా నిర్వహించినట్టు పార్టీ వర్గాల సమాచారం. అయితే.. రాష్రంయనలో ఎన్నికలకు ఇంకో రెండేళ్ల పమయం ఉండగానే రాష్ట్రంలోని సమస్యలను విదిలేసి ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారనే అనుమానాలు పలురులో వ్యక్తం అవుతున్నాయి. మరోసారి ముందస్తు ఎన్నికలకు వచ్చే ఆలోచనతో సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారనే ముచ్చట వినిపిస్తోంది.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా సానుభూతి ఓట్లతో 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండి తనదైన స్టైల్ లో రాష్ట్రంలో రాజకీయాన్ని నడుపుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు తావు కేకుండా పదవుల ఆశ చూపి ఇతర పార్టీలో గెలుపొందిన నేతలను తన పార్టీలో చేర్చుకొని నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టు పాలన సాగిస్తున్నారని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇటు 2019లో టీడీపీ కాంగ్రెస్ సంయుక్తంగా తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగడానికి కావలసిన పరిస్థితులను కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ తర్వాత ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు వచ్చి.. 2018 డిసెంబర్ ఎన్నికల్లోనూ గెలుపొంది రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్. అందుకు తన రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తన విజయాన్ని నల్లేరుపై నడకలాగే సాగించుకున్నారు కేసీఆర్ అని నిపుణలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో సారి విజయం సాధించేందుకు ముందస్తుగానే వ్యూహరచన చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కానీ.. రాజకీయంగా రాష్ట్రంలో రోజురోజుకు మారుతున్న పరిస్థితులతో ప్రజల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలవుతూ వచ్చింది. దీన్ని పూడ్చేందకు పీకేను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనేది రాజకీయ నేతల్లో చర్చగా మారింది. ఇప్పటి నుండే పీకే వ్యూహాలతో రానున్న ఎన్నికల్లో ముందుకు వెళ్లే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఆలోచనలతో పాటు ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోందని రాజకీయ నేతల్లో చర్చ నడుస్తోంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా రాజకీయ పరిణామాలను తనకు అనుగుణంగా మల్చుకుంటారనే పేరు దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ కు ఉంది. ఈ నేపథ్యంలో తన సలహాలు, సూచనలతో ఉన్నికల్లో ముందుకెళ్లే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఇంకో వైపు ఇక కనుమరుగవుతదనుకున్న కాంగ్రెస్ కొత్త నాయకత్వంతో రాష్ట్రంలో చాపకింద నీరులా పాకుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 2023 లో జరగబోయే ఎన్నికలు రాష్ట్రానికి కీలకంగా మారనున్నాయి. కానీ.. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ సారి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత ఈజీ కాదని నిపుణులు చెప్తున్నారు. అయితే.. దానికి హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలు నిదర్శనం అని పలువురు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాష్ర్ ప్రభుత్వం వద్దకు చేరిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అది తెలిసినప్పటి నుండి కేసీఆర్ లో కాస్త భయం మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలనే దృఢసంకల్పంతో పీకేను రంగంలోకి తీసుకొపస్తున్నారనే విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతలు కూడా సొంత పార్టీ పైన వ్యతిరేకంగా ఉన్నారనేది కూడా వినిపిస్తోంది. ఈ ప్రభావం రానున్న ఎన్నికల్లో ప్రభుత్వంపై పడే ప్రమాదం ఉన్నట్టు నేతలు చెప్పుకుంటున్నారు.
మరోవైపు కేంద్రంలో బీజేపీ దగ్గరి నుంచి, ఎన్నో ప్రాంతీయ పార్టీలకు పీకే సేవలు అందించారు. రాజకీయ విజయాలలో ఆయనకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది. అందుకు గాను పీకే సేవలతో మూడో విడత అధికారాన్ని దక్కించుకోగలమన్న విశ్వాసంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలపై కేసీఆర్, కేటీఆర్ లు పీకేతో చర్చించినట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో సేవలకు సంబంధించిన ఒప్పందంపై తండ్రి కోడుకులు పీకేతో కసరత్తు జరుగుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్చలు ఫలిస్తే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ రావడం ఖాయమని పలువురు రాజకీయనేతలు అభిప్రాయ పడుతున్నారు. ఈ సారి ముందస్తు ఎన్నికలు పెట్టినా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టం అనే వాదన కూడా అదే స్థాయిలో ప్రజల్లో వినిపిస్తోంది. అయితే.. ఏపీలో వైసీపీ, పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు పీకే సేవలు ఫలితాలనిచ్చాయి. ఈ తరహాలో ఇప్పుడు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ పీకే కలిసి ఏం చేస్తారనేది ఇంకొంత కాలం వేచి చూడకతప్పదని పలువురు రాజకీయ నిపుణులు చెప్తున్నారు.