సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌తో దూరం మెయింటెన్ చేస్తున్నారా…? నరసింహన్ వెళ్లిపోవటం సీఎంకు ఇబ్బందిగా మారిందా…? అంటే అవుననే అంటున్నాయి ప్రగతి భవన్ వర్గాలు.
కనీసం వారానికి ఒకసారైన సీఎం కేసీఆర్ రాజ్‌భవన్ వెళ్లేవారు. నాటి గవర్నర్ నరసింహన్‌తో గంటల తరబడి చర్చలు జరిపేవారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై ఎంతో సీనీయర్ అధికారికగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న గవర్నర్ సలహాలు-సూచనలు తీసుకునే వారు కేసీఆర్. ఇద్దరి మధ్య రిలేషన్ బాగా ఉండటంతో… ప్రభుత్వానికి కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా బండి నడిచిపోయేది.
కానీ కొత్త గవర్నర్ వచ్చాక సీఎం కేసీఆర్ రాజ్‌భవన్ వైపు చూడటం కూడా మానేశారు. గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తమిళిసై, వెంటనే కొత్తమంత్రుల చేత సెప్టెంబర్ 10న ప్రమాణస్వీకారం చేయించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక సీఎం కేసీఆర్ రాజ్‌భవన్ గడప తొక్కలేదు. ఇప్పుడిదే చర్చనీయాంశం అవుతోంది.
పొలిటికల్‌గా అవసరం లేదనే రావటం లేదా… ఆనాటి గవర్నర్ సలహాల కోసమే అప్పుడు వచ్చేవారా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. రాష్ట్రంలో అప్పుడే చిన్న సమస్య వచ్చిన వెంటనే గవర్నర్ వద్దకు వెళ్లేవారు కేసీఆర్. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఇంత పెద్ద ఆర్టీసీ కార్మిక సమ్మె నడుస్తున్నా… గవర్నర్‌తో నామమాత్రంగా కూడా చర్చించటం లేదు. పైగా… గవర్నర్ ఈ మధ్య చేస్తున్న ఆయా శాఖలపై రివ్య్యూల విషయంలో కూడా సీఎం కేసీఆర్‌కు అసంతృప్తి ఉన్నా… వేచి చూసే ధోరణిలో ఉన్నారని తెలుస్తోంది. పైగా ప్రస్తుత గవర్నర్ బీజేపీ ఆక్టివ్ పాలిటిక్స్ నుండి రావటంతో…ఆమె బీజేపీకి ఫేవర్ చేస్తారని కేసీఆర్ దూరంగానే ఉంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం.
మొత్తానికి గవర్నర్ నరసింహన్ లేని లోటు సీఎం కేసీఆర్‌కు పెద్ద తలనొప్పిగా తయారైందని టీఆరెఎస్ వర్గాల కథనం.