సీఎం కెసిఆర్ కొత్త ఫామ్ హౌస్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. సీఎం కెసిఆర్ కొంత కాలంగా దగ్గరుండి మరి ఈ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు .దాదాపు ఎకరం విస్తీర్ణం లో ఈ కొత్త ఇంటి నిర్మాణం జరుగుతోందని తెలుస్తోంది.
ఈ నెల 22న సీఎం కెసిఆర్ కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంది. అయితే… ఇంకా పనులు పూర్తి అయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉండటం తో…. వాయిదా పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
అయితే…. ఈ కొత్త ఇల్లు సర్వాంగ సుందరంగా ఉండబోతుందని తెలుస్తోంది. కొత్త ఇంటి ఫోటోలను తొలివెలుగు.కామ్ ఎక్సక్లూసివ్ గా సంపాదించింది. ఎన్ని కార్లు వచ్చినా ఇబ్బంది లేకుండా పార్కింగ్, ఎవరైనా మంత్రులు సహా ఇతర గెస్ట్ లు వచ్చినా సమీక్షలు, మీటింగ్ ఏర్పాటు చేసుకోవటానికి కాన్ఫరెన్స్ హాల్, భోజనం చేయటానికి స్పెషల్ రూమ్, గెస్ట్ ల కోసం అవుట్ హౌస్ కూడా ఉండబోతుంది.
ఇక సీఎం కెసిఆర్ ఉండే ఇల్లు ప్రత్యేకం గా ఉండబోతుంది. తెలంగాణ భవన్ ఎలా ఉందొ అలాగే… అక్కడ కూడా స్పెషల్ గా డిజైనే చేశారని తెలుస్తోంది. నిజాం రాజుల తరహా డిజైన్ ఉంటుందని ఫామ్ హౌస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కొత్తింటికి నాలుగు దారులు ఉండబోతున్నాయి..ఒక్కోదారి నుంచి వస్తే ఒక్కో స్టైల్ లో కనిపించేలా డిజైన్ చేశారని సమాచారం.