దుబ్బాక ఉప ఎన్నిక ఓటమితో చేతులు కాల్చుకున్న టీఆరెస్, గ్రేటర్ లో బీజేపీని తక్కువ అంచనా వేసి బొక్క బోర్లా పడింది. ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముంచుకొస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ రూపంలో ఓటమి వెంటాడుతోంది. దుబ్బాకలో హరీష్, గ్రేటర్ లో కేటిఆర్ ఫెయిల్ కావటంతో సాగర్ లో కేసీఆర్ బరిలోకి దిగారు. రాజకీయంగా నిలవాలంటే గెలిచి తీరాల్సిన పరిస్థితి ఉంటడంతో ఈ నెల 10న నాగార్జున సాగర్ లో పర్యటనకు వెళ్తున్నారు. ఉప ఎన్నికల రణభేరి మోగించనున్నారు.
నల్గొండ టూర్ లో ఎత్తిపోతల పథకం శంకుస్థాపన అని చెప్తున్నప్పటికి ఉప ఎన్నికల్లో గెలుపు కోసం పలు హామీలు ఇవ్వనున్నారు. నిజానికి ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రులు ఇలా ప్రచారానికి వెళ్ళరు. కానీ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని…. మారుతున్న తెలంగాణ రాజకీయాల్లో టీఆరెస్ కు అగ్ని పరీక్ష అంటున్నారు విశ్లేషకులు.