దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర కలత చెందారు. స్వయంగా రామలింగారెడ్డి స్వగ్రామమైన చిట్టాపూర్ వెళ్లి.. ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. రామలింగారెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ముఖ్యమంత్రి కన్నీటి పర్యంతమైయ్యారు. రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అటు అంత్యక్రియలు ముగిసేవరకు మంత్రి హరీష్ రావు కూడా అక్కడే ఉన్నారు. అంతిమయాత్రలో పాల్గొని రామలింగారెడ్డి పాడెను కొద్దిసేపు తన భుజాలపై మోసారు. రామలింగారెడ్డి మృతివ్యక్తిగతంగా తనకు ఎంతో లోటు అని హరీష్ రావు అన్నారు.