గ్రేటర్ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ చేరుకోలేకపోవడంతో కొత్త పాలక వర్గం ఏర్పాటుకు అధికార పార్టీ కిందామీదా పడుతోంది. దీంతో ప్రస్తుత పాలకవర్గాన్ని కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్‌కు ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువు ఉంది. చట్టం ప్రకారం ముందే పాలకమండలిని గడువుకు ముందే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ నేరుగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే మార్గాలు లేకపోవడంతో యధాతధ స్థితినే కొనసాగించేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
వాస్తవానికి మెజారిటీ వస్తే జీహెచ్ఎంసీ కౌన్సిల్‌ను వెంటనే రద్దు చేసి.. కొత్త మేయర్‌ను, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవాలని ప్రభుత్వం యోచించింది. ఇప్పుడు కావాల్సిన సంఖ్యా బలం లేకపోవడంతో మరికొంత సమయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. దీంతో ప్రస్తుత బల్దియా పాలకమండలి గడువు పూర్తయ్యేవరకూ కొనసాగే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.