తెలంగాణలో పాలన అటకెక్కింది. మంత్రులు ఎవరూ తాత్కాలిక సచివాలయం వైపు తొంగి చూడటం లేదు. సీఎం ఎలాగు ప్రగతి భవన్ దాటరు. దాంతో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది, ఉన్నతాధికారులు కూడా ఎవరు ఎక్కడుంటారో, ఎప్పుడు వస్తారో తెలియదు. పాలన అంతా ఎవరి ఇంటి నుండి వారు సాగిస్తున్నారు అంటూ తొలివెలుగు ఓ విశ్లేషాణాత్మక కథనాన్ని రాసింది. తెలంగాణపాలన@MYHOME అంటూ ఏ మంత్రి ఎక్కడ నుండి పాలిస్తున్నారో స్పష్టంగా తెలిపింది.
దీంతో సీఎం కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. తాత్కాలిక సచివాలయానికి వెళ్లలేని పరిస్థితి ఉంటే కనీసం మంత్రుల నివాస సముదాయం అయిన మినిస్టర్స్ క్వార్టర్స్‌లో అయినా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండండి అంటూ ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. మంత్రులంతా ఎవరి ఇంటి దగ్గర వారు ఉంటే… ప్రజలకు ఇబ్బంది అవుతుందని, వెంటనే బంజరాహిల్స్-12 కు షిఫ్ట్ అయిపోవాలని సీఎంవో నుండి మంత్రులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో నగర మంత్రులకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం.
తొలివెలుగు అసలేం రాసిందంటే…
Advertisements
http://tolivelugu.com/telangana-ministers-higher-officials-doing-their-jobs-from-like-kcr/