కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. వ్యవసాయ రంగానికి సంబంధించి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం.. ధాన్యం కొనుగోళ్లు సహా పలు అంశాలపై అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు.
మోడీ ప్రభుత్వం తిరోగమన విధానాలు అవలంభిస్తోందని ఆరోపించారు కేసీఆర్. రైతులకు ఎలాంటి ప్రోత్సహకం అందించకుండా నిరుత్సాహపరుస్తోందని విమర్శించారు. అటు వానాకాలం రానున్న నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం. కల్తీ విత్తనాల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వ్యవసాయ రంగం కీలకంగా మారిందని చెప్పారు కేసీఆర్. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు మరింతగా విస్తరిస్తోందని… రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తవుతాయని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కార్యాచరణను మరింత పటిష్టంగా కొనసాగిస్తూనే ఉంటామన్నారు.
ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు హాజరయ్యారు.