టీఆర్ఎస్ లో సీనియర్స్ కు రాజకీయ భవిష్యత్ లేదా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. సీనియర్స్ లో నాయిని, తుమ్మల, వేణుగోపాల చారీ,మందా జగన్నథం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్వామి గౌడ్, మధుసూదన చారి, ఏనుగు రవీందర్ రెడ్డి, జూపల్లి కృష్ణ రావు, కడియం శ్రీహరి ఇలా చాలామంది రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం గానే ఉంది.
వీరిలో కొందరు ఓడిపోగా… మరి కొందరికి మొన్నటి ఎన్నికలలో టికెట్ కూడా దొరకలేదు. ఇంకొంతమందికి నామినేటెడ్ పదవులు లభించే అవకాశాలు కనపడడంలేదు. ఇప్పటికే నామినేటేడ్ పదవుల్లో ఉన్న సీనీయర్లకు రెన్యూవల్ వచ్చే అవకాశం కనిపించటం లేదు. ఇక సమీప భవిష్యత్‌లో వస్తాయన్న అవకాశం కూడా కనిపించటం లేదు.
దీంతో వారి రాజకీయ భవిష్యత్ కు ఫుల్ స్టాప్ పడినట్లే అంటున్నారు గులాబీ తమ్ముళ్లు. ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన వారితో కార్ ఓవర్ లోడు అయింది. ఇంకా ఎక్కించుకునే పరిస్థితి లేదు.. కార్లో ఉన్నవారిని కొందరిని దించితే తప్ప కారు ప్రయాణం సజావుగా సాగెటట్లు లేదు… అందుకే కేసీఆర్ ఎవరిని దించాలి, ఎవరిని ఉంచాలి అని కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.
దీనికి సీనియర్స్ ను కారు దించింతే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారని సమాచారం. అదే జరిగితే పైన చెప్పిన వారికి రాజకీయ భవిష్యత్ ఉండకపోవచ్చు అని గూలబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. గులాబీ బాస్ ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన ఎమ్మెల్యేలతో పాటు కారు గుర్తు మీద గెలిచిన వారిలో కొందరికి క్యాబినెట్ హోదా ఉన్న నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. అందుకే దాదాపు ముప్పై చైర్మెన్ పోస్టులకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఆర్డినెన్సు కూడా తేవడం జరిగింది అని చెప్పుకొస్తున్నారు.
డిసెంబర్ 13వ తేదిలోపు కొందరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వవచ్చని చెప్తున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల తరువాత మరికొందరికి ఇవ్వచ్చు అని తెలుస్తుంది. దీంతో గులాబీ సైన్యంలో గుబులు మొదలైంది ఎవరి రాజకీయ భవిష్యత్ ఏమవుతుందో అనే టన్షెన్ మొదలైంది. ఎవరి రాజకీయ భవిష్యత్ కి ఫుల్ స్టాప్ పడుతుందో ఎవరి రాజకీయ భవిష్యత్ కొనసాగుతుందో వేచి చూడాలి.
బీజేపీతో కేసీఆర్ దోస్తానా ముగిసినట్లేనా…?
గుజరాత్ అల్లర్లలో నరేంద్ర మోదీకి క్లీన్ చిట్..!