సీఎం కేసీఆర్ తన దృష్టంతా ఇప్పుడు ఫాంహౌజ్ మీదే పెట్టినట్లు కనపడుతోంది. అందుకే గత కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ ప్రతిరోజు ఎర్రవల్లి ఫాంహౌజ్‌కు వెళ్లి వస్తున్నారు. సాయంత్రం నాలుగైదు గంటల సమయంలో ఫాంహౌజ్‌కు వెళ్లి రాత్రి వరకు అక్కడే ఉంటున్నారు. గత కొద్దిరోజులుగా ఇదే పనిగా సీఎం కేసీఆర్ ప్రతిరోజు వెళ్లి రావటం ఎంటా అని తొలివెలుగు టీం ఆరా తీసింది.
సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడా ఇల్లును దగ్గరుండి అంతా తానే చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రత్యేకంగా అక్కడే ఉండి అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ సీఎం కేసీఆర్ తాను ఎంతో ఇష్టంగా తన కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే సీఎం ఫస్ట్ ప్రియారిటీ తన ఇంటి నిర్మాణానికే ఇస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
సోమవారం హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై కీలక విచారణ ఉన్నా… సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌కు వెళ్లటం మాత్రం ఊరుకోలేదు. సాయంత్రం వచ్చాక ఆర్టీసీ సమ్మె, హైకోర్టు విచారణ అంశాలపై రివ్యూ ఉంటుందని అధికారులకు సమాచారం ఇవ్వండని చెప్పి… సీఎం ఎర్రవల్లికి వెళ్లిపోయారని తెలుస్తోంది. దాంతో సీఎంవో వర్గాలు రివ్యూ మీటింగ్‌పై అధికారులకు సమాచారం అందించాయి.
ఎంత పెద్ద మీటింగ్ ఉన్నా… సీఎం కేసీఆర్ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం తన కొత్త ఫాంహౌజే అన్నట్లు కనపడుతోంది.