తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరు గొప్ప అంటే.. ఏం చెప్తారు? వయస్సు, అనుభవం దృష్ట్యా కేసీఆర్ పేరు చెప్తేనే బెటర్ అని చాలా మంది ఓ కన్‌క్లూజన్‌కు వస్తారు. అయితే తాజాగా ఓ సర్వే మాత్రం ఆ అంచనా తప్పని తేల్చింది.
ఇండియా టుడే, కార్వి ఇన్‌సైట్స్ కలిసి దేశవ్యాప్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కేసీఆర్.. జగన్ కంటే చాలా వెనకబడ్డారు. వారి సర్వే ఫలితాల్లో దేశంలో బెస్ట్ సీఎంగా కేసీఆర్ 9వ స్థానానికి పరిమితమైతే.. జగన్ 3వ స్థానాన్ని సాధించగలిగారు. ఈ సర్వేను జులై 15 నుంచి జులై 27 మధ్య నిర్వహించారు.
దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని.. 194 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 12,021 మందిని ఫోన్లలో సంప్రదించారు. మీ దృష్టిలో బెస్ట్ సీఎం ఎవరు అని వారిని ప్రశ్నించారు. వారిలో 11 శాతం మంది జగన్‌కు జైకొట్టగా.. కేసీఆర్‌కు కేవలం 3 శాతం ఓట్లే వచ్చాయి.
కాగా ఈ సర్వేలో యూపీ సీఎం 24 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా.. 15 శాతం ఓట్లతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రెండో స్థానాన్ని సాధించగలిగారు. దాంతో ఆయన వరుసగా మూడవసారి ఉత్తమ సీఎంగా నిలిచారు. .