పిర్ర గిచ్చి జోల పాడడం అంటే ఇదే… ఆర్టీసీ కార్మికులు మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో అంటే ససేమిరా అన్న ముఖ్యమంత్రి కేసీఅర్ ఇప్పుడు మీరు నా బిడ్డలే, మీకు ఏమికాదు, నేను ఉన్నాను అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అంటూ రాజకీయ వర్గాలు నొచ్చుకుంటునాయి. ఇదేదో అప్పుడే ప్రకటించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదుగా అంటున్నారు. ఎందుకు ఇంతదాకా తెచ్చినట్లు… మమ్మల్ని పిలిచి మాట్లాడి, కేసీఅర్ ఒక్కమాట చెపితే చాలు మేము విధులకు హాజరు అవుతాం అంటే ససేమిరా అని, మీరు హ్యాపీగా మీ డ్యూటీలు మీరు చేసుకోండి అని ఇప్పుడు చెప్పడం ఎందుకు…? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంటే ఎదైనా నేనే చేయాలి.. పెట్టినా, తిట్టినా నేనే… ఇంకా ఎవరు చేయరు అని చెప్పాలని తప్ప మరొకటి కనపడటంలేదు అంటున్నారు కేసీఆర్‌ను దగ్గర నుండి చూసిన నేతలు. కేసీఅర్ కు సమస్యను నేనే సృష్టించి నేనే పరిష్కరించాలని ఉంటుంది అని కొందరు పార్టీ సీనియర్ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇలా చాలా సందర్భాల్లో జరిగిందని, ఇప్పుడు అదే కంటిన్యూ అయిందని స్పష్టం చేస్తున్నారు. విషయాన్ని లోతుగా అంచనా వేస్తే నిజమే అనిపిస్తుంది.
ఆర్టీసీ ఎపిసోడ్‌లో సమ్మెను రెండు రోజులలో ముగించగలిగే శక్తి ఉన్న కేసీఆర్ ఎందుకు ఇంతదాకా లాగినట్లు, పైగా ఆర్టీసీని నడపలేమని… ప్రభుత్వం ఒక్క పైసాకుడా ఇవ్వలేదని, సంస్థ మనుగడ కష్టమని ఇలా అనేక విషయాలు అటు హైకోర్టులో ఇటు మీడియా సమావేశాలలో చెప్పిన ప్రభుత్వం కాని ఆర్టీసీ యాజమాన్యం కానీ కేసీఅర్ కాని ఇప్పుడు అబ్బే అదేమిలేదు సంస్థను లాభాల బాటలో తెద్దాం ఎలా లాభాలు రావో చూద్దాం… నేనే స్వయంగా కార్మికులతో మాట్లాడుతా, కావల్సిన చర్యలు తీసుకుందాం అని ఇప్పుడు చెప్పడం ఎలా చూడాలి అన్న ప్రశ్నలు రాక మానవు. అంటే కింద పడ్డ బాంచత్ పైన పడిన బాంచత్ అనే ధోరణి తప్ప మరొకటి కాదు అంటున్నారు విశ్లేషకులు.
సమ్మె తో కార్మికుల మీద ప్రజల వ్యతిరేకత వస్తుంది అని కేసీఅర్ భావించారు కాని అలా జరగకపోగా సమ్మె కొనసాగుతున్న కొద్ది కార్మికుల పట్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతూ వస్తోంది. ట్యాంక్ బండ్ మిలియన్ మార్చ్ సందర్భంగా పోలీసులు లాఠీఛార్జ్ కాని సమ్మె విరమిస్తునట్లు ప్రకటించాక… డిపోల దగ్గరకి వెళ్ళిన డ్రైవర్లను కండక్టర్ లను అడ్డుకున్న తీరు… ఆ సందర్భంగా మహిళ కార్మికులు కంటతడి పెట్టిన దృశ్యాలు అందరినీ కలచివేశాయి. మాకు ఆత్మహత్య లు తప్ప మరో మార్గం లేదు… సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతం అంటూ వారు వ్యక్తం చేసిన ఆవేదన కూడా ప్రజల లో సానుభూతి కలిగించింది. దీనితో అటు ఇంటలిజెన్స్, ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సమ్మె ఇలాగే కొనసాగితే మేము నియోజకవర్గలలో తిరగలేమని చెప్పినట్లు సమాచారం. ఇంతకాలం ఎందుకు సాగదీసినట్టు ఇంతమంది మరణాలకు ఎందుకు కారణం అయినట్లు ఇదేదో అప్పుడే చేసి ఉంటే బాగుండేది కదా అని అందురు అనుకుంటారు కాని కేసీఅర్ రూటే…. సపరేటు… అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎదైనా నేనే చేయాలి సమస్యను నేనే సృష్టిస్త నేనే పారిస్కరిస్తా అంటాడు అంటున్నారు. ఎది ఏమైతేనేమి కథ సుఖాంతం అయిందని కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు.