నాయకులను టీవీ చర్చలకు వెళ్లొద్దంటూ కేసీఆర్ హుకుం? ఇప్పుడి అంశమే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఓవైపు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టి రోజులు గడుస్తున్నా సర్కార్ నుండి స్పందించన వారే లేరు. మరోవైపు పార్టీలో కేటీఆర్ సీఎం అని కామెంట్స్ చేస్తుండగా, ఈటెల రాజేందర్ ను సీఎం చేస్తే తప్పేంటీ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఇలాంటి సందర్భంలో టీఆర్ఎస్ నాయకులను టీవీ డిబెట్లకు దూరంగా ఉండాలని అధిష్టానం నుండి ఆదేశాలు వచ్చినట్లు ప్రచారం సాగుతుంది. ఎవరికి వారు ఇష్టానుసారంగా టీవీ చర్చలకు వెళ్లటం, అక్కడ ఎదైనా మాట్లాడితే… ఇక్కడ పార్టీ వేరుగా నిర్ణయం తీసుకుంటే లేనిపోని ఇబ్బందవుతుందన్న కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆదివారం మద్యాహ్నాం 2గంటలకు తెలంగాణ భవన్ లో కీలక సమావేశం ఉంది. ఈ మీటింగ్ కు పార్టీ ముఖ్యమైన నేతలందరికీ ఆహ్వానం అందింది. కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఆ సమావేశంలో పార్టీ శ్రేణులకు, నేతలకు దిశానిర్ధేశం చేయబోతున్నారు. దీంతో నేతలను తదుపరి ఆదేశాలు అందేవరకు చర్చలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలోనే సీఎం మార్పు అంశంపై కేసీఆర్ క్లారిటీ ఇస్తారంటూ టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.