ఫ్యాక్షనిస్టులు తన నీడను తాము నమ్మరు అనేది ప్రాచుర్యంలో ఉన్న మాట. కానీ రాజకీయ నాయకులకు అలా కాదు. ఎవర్నో ఒకర్ని నమ్మందే పనులు కావు. అందుకే ప్రతి నేతకు ముఖ్య అనుచరులు, పెద్ద నేతలకు అయితే కొందరు కీలక అధికారులు నమ్మకంగా ఉంటారు. అందుకు కేసీఆర్ కూడా అతీతుడేమీ కాదు.
కానీ కేసీఆర్ తన చుట్టూ తిరిగే వారిపై కూడా నిఘా పెట్టేంతగా పరిస్థితులు ఎందుకు వచ్చాయన్నదే అసలు కారణం. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండి… అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా ఉన్న పీఆర్వో విజయ్ ఉద్వాసనతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసీఆర్ ఓ విషయాన్ని బలంగా నమ్మితే తప్పా… ఎవరో చెప్తే వెంటనే చేసేసే రకం కాదు. ఆన్ పేపర్ ఎవిడెన్స్ కు తోడు బలమైన కారణం కూడా కావాల్సిందే.
సీఎంకు సన్నిహితంగా విజయ్ తి అవినీతి చేశాడన్న ఆరోపణ బలంగా ఉంది. కానీ అదొక్కటే కారణం కాదు అన్నది టీఆర్ఎస్ నేతల్లో కొందరి అభిప్రాయం. బలమైన రాజకీయం కారణం ఉంటేనే… కేసీఆర్ వేటు వేస్తారని గట్టిగా చెప్తున్నారు. అయితే గతంలో ప్రగతి భవన్ లో ఇంటి దొంగలున్నారని, బీజేపీకి కీలకమైన సమాచారం లీక్ చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇందులో విజయ్ పాత్ర ఉందని నిర్ధారణ అయ్యిందన్న విషయమే అసలు కారణమా అన్న చర్చ సాగుతుంది.
ఎక్కడో చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తిని అందలం ఎక్కించాక… అవతలి వర్గానికి సపోర్ట్ చేసేందుకు కూడా బలమైన కారణం కావాల్సిందే కదా… మరీ ఆ కారణం ఏంటీ, కేసీఆర్ తన నీడగా ఉన్న విజయ్ పై 2 నెలలుగా నిఘా పెట్టించారంటే తనకు తెలిసిన విషయం ఏంటీ అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.