ఆర్టీసి సమ్మె పై వెనక్కి తగ్గేది లేదంటున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్. నవంబర్ 5 ఆర్టీసి కార్మికులకు డెడ్ లైన్ పెట్టారు.చేరితే చేరండి…లేదంటే మీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
గతంలో కెసిఆర్ మీడియా సమావేశం, ఇవాళ్టి సమావేశాన్ని గమనిస్తే బీజేపీని టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టంగా అర్ధం అవుతోంది. మోడీ ప్రభుత్వం తెచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని తూచ తప్పకుండా పాటిస్తామని ముఖ్యమంత్రి బీజేపీ కి బాణం ఎక్కుపెట్టారు. పదే పదే ఈ చట్టాన్ని ప్రస్తావించారు.కేంద్రమే ప్రైవేట్ బస్సులను ప్రోత్సహిస్తోందని దీన్నే మేము పాటిస్తామని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అంటే ఆర్టీసి సమ్మె కు పూర్తి మద్దతు అందిస్తున్న బీజేపీ టార్గెట్ గా కెసిఆర్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.అంతే కాదు టీఆరెఎస్ కు ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ ముందుకొస్తుంది.కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. ఈ సమయంలో సమస్య కేవలం బీజేపీ వల్లే అని బీజేపీని ప్రజల ముందు దో షి గా నిలబెట్టే ప్రయత్నం కెసిఆర్ చేస్తున్నారన్న ది విశ్లేషకుల అభిప్రాయం.