బీజేపీతో అమితుమీకే సీఎం కేసీఆర్ ఫిక్స్ అయ్యారా…? టీఆర్ఎస్‌ను బీజేపీ టార్గెట్ చేసిందని కేసీఆర్ నమ్ముతున్నారా…? బీజేపీని ఎదుర్కొనేందుకే కేసీఆర్ ఎంఐఎంను అక్కున చేర్చుకుంటున్నారా…?
సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎవరితో దోస్తీ కడతారో ఊహించటం కష్టం. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీతో ఉన్న సానుకూల వాతావరణం పూర్తిగా చెడిపోయింది. అప్పటి వరకు ఎంఐఎంతో దోస్తీ కట్టినా బీజేపీ సానుకూలంగా ఉంది. కానీ రెండోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయగానే అనూహ్యంగా పరిణామాలు మారిపోయాయి.
అభివృద్ధికి నిధుల్లేవ్ కానీ 128కోట్లతో కొత్త కార్లు
అదునుకోసం బీజేపీ ఎదురు చూస్తున్న తరుణంలో… ఎంఐఎంతో దోస్తీ కడుతూనే బీజేపీని ఎదుర్కోవాలని సీఎం కేసీఆర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దేశంలో ఎన్.ఆర్.సీ, పౌరసత్వ చట్ట సవరణ లాంటి అంశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసిన సీఎం కేసీఆర్… బీజేపీపై పోరాడుతున్న ఎంఐఎంకు బాహటంగానే మద్దతు పలుకుతున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వంగా ఎలాంటి సహయం చేయాల్సి వచ్చినా చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
ఎంఐఎం నిజామాబాద్‌లో బీజేపీకి వ్యతిరేకంగా సభ పెట్టింది. హిందూ దేశంగా మార్చేయాలన్న కుట్ర జరుగుతుందని ఆరోపిస్తోంది. అక్కడ బీజేపీ ఎంపీ ఉండగా… మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కానీ దేశవ్యాప్తంగా ఉన్న సీఎఎ ఆందోళలను నిజామాబాద్‌లో అంతగా లేవు. పైగా హైదరాబాద్ ఎంపీ, హైదరాబాద్‌ను కాదని నిజామాబాద్‌లో సభ పెట్టిన ఉద్దేశం స్పషంగా కనపడుతోంది.
గ్రహణం కోసం మోడీ లక్షన్నర అద్దాలు
మరోవైపు సీఎఎ వ్యతిరేక సభ కోసం ఎంఐఎంకు అనుమతిస్తే… తాను కూడా సీఎఎ మద్దతుగా సభ నిర్వహిస్తానని, తనకు అనుమతివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికే కోరారు. కానీ రాజాసింగ్ సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు… ఎంఐఎంకు మాత్రం అనుమతిచ్చారు. దీన్ని బట్టి బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తోన్న ఎంఐఎంతో కలిసి నడవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా కనపడుతోంది.
మరోవైపు నిజామాబాద్‌లో అతి త్వరలో జరగబోయే పురపాలిక ఎన్నికల్లో బీజేపీని దెబ్బ కొట్టే వ్యూహం ఉందని, ఓటర్లను మత ప్రాతిపాదికగా చీల్చి లాభపడే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ఎంఐఎంకు నిజామాబాద్ సభకు అనుమతిచ్చిందని, రాజకీయంగా లబ్ధిపొందేందుకే ఎంఐఎం సభలో టీఆర్ఎస్ కూడా పాల్గొనబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Advertisements
మంత్రి గంగుల బ్లాక్‌మెయిల్ రాజకీయం