తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ముందుగా రాష్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మార్చి 31 వరకు విధించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతోపాటు దేశవ్యాప్తంగా కరోనా పంజా విసురుతుండటంతో కేంద్రం లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 వరకు పాటించాలని ఆంక్షలు విధించింది. ఈ క్రమమలోనే టి. సర్కార్ కుడా లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 వరకు పొడిగించానున్నట్లు తెలుస్తోంది. కరోనా రాష్రంలో తన రాక్షసతత్వాన్ని మరింత ప్రదర్శిస్తుండటంతో లాక్ డౌన్ కొనసాగింపుపై తెలంగాణ సర్కార్ ఆలోచనలో పడింది. ఈమేరకు అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తోన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు అవుతోన్న లాక్ డౌన్ పై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
నిత్యావసరాల గురించే ప్రజలు అధికంగా బయటకు వస్తున్నారని అధికారులు సీఎంకు తెలుపగా… ప్రజలు తిరుగుతూ ఉంటే కరోనాను కట్టడి చేయలేమని లాక్ డౌన్, కర్ఫ్యూలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా… లాక్ డౌన్ ను, రాత్రిపూట విదిస్తోన్న కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. ఇందుకు సంబంధించి రేపోమాపో ప్రకటన వెలువడే చాన్స్ ఉంది.