సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత గవర్నర్‌ను కలవబోతున్నారు. గవర్నర్‌గా తమిళిసై ప్రమాణస్వీకారం, మంత్రివర్గ విస్తరణ జరిగిన సెప్టెంబర్ 8 తర్వాత మళ్లీ గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ కావటం ఇదే ప్రథమం.
రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ అంశాలపై సీఎం గవర్నర్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలవబోతున్నారు. అయితే, త్వరలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం, కొత్తగా తీసుకరాబోయే రెవెన్యూ చట్టంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్టీసీ కార్మిక సంఘాలు, రెవెన్యూ సంఘాలు ఇదే అంశంపై ఇప్పటికే గవర్నర్‌ను కలిసి తమ డిమాండ్లు, అభ్యంతరాలను తెలిపిన నేపథ్యంలో… ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇంకా నిర్ణయం తీసుకొని నేపథ్యంలో… తిరిగి విధుల్లో చేర్చుకునే అంశంపై చర్చ జరుగుతుందని రాజకీయ, కార్మిక వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.