యాదాద్రి క్షేత్రాన్ని రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ప్రధాన ఆలయంతోపాటు క్యూలైన్, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట, ప్రెసిడెన్షియల్ సూట్ పనులను కేసీఆర్ పరిశీలించనున్నట్టు తెలిసింది. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు చెప్తున్నారు.
కాగా, యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. త్వరలోనే స్వామివారి మూలవరుల దర్శనం భక్తులను కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ముహూర్తంపై ఇప్పటికే కేసీఆర్ ఓ అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో కేసీఆర్ రేపు యాదాద్రి క్షేత్రంలో పర్యటిస్తున్నారు.