తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మంటతో బాధపడుతున్నారు. బుధవారం సాయంత్రం నుండి సీఎం కేసీఆర్ ఊపిరితిత్తుల్లో సమస్యతో బాధపడుతుండగా… ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి రావు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నారు. శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, గుండె వైద్యుల నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ ముఖ్యమంత్రికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు.
యశోధ ఆసుపత్రిలో ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ చేస్తున్నారు. పలు రక్తపరీక్షలు కూడా చేశారు. ఈ రిపోర్టుల ఆధారంగా ఆయనకు ఇంట్లో ఉంచి వైద్యం అందించటమా, ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో వైద్యం అందించాలా అన్న నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ రావు తదితరులున్నారు.