తెలంగాణ సీఎం కేసీఆర్ కొండగట్టుకు చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సీఎంకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల, గంగుల స్వాగతం పలికారు. ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాల పరిశీలించిన కేసీఆర్.. తర్వత బస్సులో కొండగట్టు గుట్టపైకి వెళ్లారు.
ఆలయ అర్చకులు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. లోపల స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు సీఎం. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్నారు.
సీఎం కొండగట్టు టూర్ సందర్భంగా పోలీసులు అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాత్రి నుంచే భక్తులకు దర్శనాలను బంద్ చేశారు. కొండ కింద షాపులను మూసి వేయించారు. కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం వంద కోట్లు ప్రకటించింది.