తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలు దేరి కరీంనగర్ కు వెళ్తారు. ఆదివారం రాత్రి కరీంనగర్ లో కేసీఆర్ బస చేసి రేపు ఉదయం వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో వెళ్లి రాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు పనులపై సమీక్షించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.