ఆదివారం టీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ ఏర్పాటు చేసిన హాడావిడి రాష్ట్ర స్థాయి సమావేశంలో కొత్త పార్టీల ప్రస్తావన చేశారు. ఇది సందర్భం కాదు కానీ కేసీఆర్ ఎందుకు స్పందించారు….? షర్మిల పార్టీపై ఆయనకు ముందే సమాచారం ఉందా….? తనను టార్గెట్ చేస్తూ వచ్చారు కాబట్టే నెగెటివ్ కామెంట్ చేశారా…?
అంటే అవుననే సమాధానం వ్యక్తం అవుతుంది. అందుకే ఆత్మీయ సమావేశంలోనే తను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సంకేతాలిచ్చింది. ఆమె సన్నిహితులు అయితే కొత్త పార్టీ పెడుతున్నట్లు మీడియా ముఖంగానే ప్రకటించేశారు. అయితే, ఈ సమావేశాల సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
షర్మిల అనే బాణం ఎవరిని టార్గెట్ చేస్తున్నట్లు అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ… తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని, రైతులు సంతోషంగా ఉన్నారా…? అందరికీ పక్కా ఇండ్లు వచ్చాయా…? అంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాదు అవసరం అయితే తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రకు కూడా రెడీ అంటూ సంకేతాలు పంపించారు.
సన్నిహితంగా ఉన్నారనుకున్న జగన్ ఫ్యామిలీ నుండే షర్మిల కేసీఆర్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టడంతో… దీని వెనుక జగన్ ఉన్నారా లేక ఇతర పార్టీలున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.