సీఎం కేసీఆర్ రేపు కొండగట్టుకు వెళ్లనున్నారు. ఆయన రాక నేపథ్యంలో అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషా దగ్గరుండి పరిశీలించారు.
హెలికాప్టర్ ద్వారా రేపు ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ జేఎన్టీయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆలయానికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుంటారు.
దర్శన అనంతరం ఆలయాన్ని అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించనున్నారు. ఆలయం వద్ద గల కోనేరు పుష్కరిణి, సీతమ్మ వారి కన్నీటి ధార, కొండలరాయుని గుట్ట, భేతాళ స్వామి ఆలయాలను తిరిగి పరిశీలించనున్నారు.
అనంతరం జేఎన్టీయూ క్యాంపస్‌లో అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఆ తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.