ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు కొత్త కొత్త హామీలు తెరపైకి వస్తుంటాయి. ముఖ్యంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో కామన్ గా ఉంటున్న అంశం నిరుద్యోగ భృతి. తాజాగా దీనిపై సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగులకు 3వేల రూపాయలను నెల నెల ఇస్తామని హామీ ఇచ్చారు.
గోవాలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుండే ఎన్నికలకు రెడీ అవుతున్న ఆప్… భృతిగా 3వేలు చెల్లిస్తామని, ఇంటికో ఉద్యోగం కల్పించటమే తమ లక్ష్యమని ప్రకటించింది. అంతేకాదు స్థానిక యువతకే 80శాతం ఉద్యోగాలు రిజర్వ్ చేస్తామని కూడా ప్రకటించారు. టూరిజంపై ఆధారపడి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు నెలకు 5వేల ఆర్థిక సహాయం చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు.