కరోనా మహమ్మారి జూలు విదుల్చుతుంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో సామాన్యుడు నుంచి డబ్బున్నోడి వరకు అందరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఏపీలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు ఈ మహమ్మారి బారిన పడగా తాజాగా భాజపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.
కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సీఎం రమేష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచనమేరకు హైదరాబాద్‌లో హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ ఎలాంటి ఆనారోగ్య సమస్యలు లేవని తెలిపారు.