ఆర్మీ చాపర్ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మృతదేహాలను గుర్తించారు అధికారులు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. తొలుత చెన్నై విమానాశ్రయం నుంచి కోయంబత్తూర్ వెళ్లి అక్కడినుంచి నీలగిరికి చేరుకుంటారాయన.