మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. కీలక నగరాలైన ముంబై, నాగపూర్, పుణే వంటి నగరాల్లో కేసుల తీవ్రత పెరిగిపోతుంది. తగ్గుతున్నాయనుకున్న కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో… కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సీఎం ఉద్దవ్ థాక్రే జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజలారా… అంతా మీ చేతిలోనే ఉంది. కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే లాక్ డౌన్ పెట్టాల్సి వస్తుంది. లాక్ డౌన్ కావాలా…? కరోనా జాగ్రత్తలు పాటిస్తారా మీరే డిసైడ్ చేసుకోవాలని థాక్రే కామెంట్ చేశారు. మాస్కులు లేకుండా ఎవరైనా కనపడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
మహారాష్ట్రలో ఫంక్షన్లు, పెళ్లిల్లు, ట్రైన్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి. దీంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతోంది. దీంతో ప్రతి 20మందిని ట్రేస్ చేసే వ్యవస్థను మళ్లీ మొదలుపెట్టాలని… లేదంటే రాష్ట్రంలో మరోసారి భారీగా కేసులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.