పనికిరాదని పారేసిన వస్తువులతో కూడా కోట్లు సంపాదించొచ్చు అంటుంటే ఏమో అనుకున్నాం. కానీ.. ఇది చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఇప్పుడు పెరిగిన ఆన్ లైన్ పరిజ్ఞానంతో ప్రతీ దానిని బిజినెస్ యాంగిల్ లోనే చూస్తున్నారు కొందరు వ్యక్తులు. అందుకు ఇదే నిర్శనం. సహజంగా ఇంట్లో అయినా గుడిలో అయినా కొబ్బరి కాయ కొడితే.. అందులోని కుడకను తీసుకొని చిప్పలను పారేస్తాం. కానీ.. అవే చిప్పలను భారీ ధరలకు అమ్ముతున్నాయి ఆన్ లైన్ ఈ-కామర్స్ సైట్లు.
ప్రస్తుతం కొబ్బరి కాయ ధర రూ.10 నుంచి రూ.30 దాకా ఉంటోంది. ఈ చిప్పల ధర మాత్రం రూ.1000కి పైనే ఉంటోంది. తాజాగా వెబ్ సైట్ రెండు కొబ్బరి చిప్పల ధరను 21.30 డాలర్లుగా చెప్పింది. మన రూపాయిల్లో రూ.1600 అన్నమాట. ఐతే.. ఈ చిప్పల కోసం ఆర్డర్ ఇస్తే.. వాటిని డోర్ డెలివరీ చెయ్యడానికి షిప్పింగ్ ఛార్జీలు 20 డాలర్లుగా చెప్పింది. అంటే మన రూపాయిల్లో డెలివరీ ఛార్జి రూ.1500. మొత్తం కలిపి రూ.3,100కు పైనే.
ప్రజలు ఎందుకూ పనికిరావని పారేస్తున్న కొబ్బరిచిప్పలకు ఆన్ లైన్ లో విపరీతమైన డిమాండ్ ఉందనుకోవాలా? లేక.. కావాలనే ఈ-కామర్స్ సైట్లు ధరలను భారీగా పెంచుతున్నాయి అనుకోవాలా? అనే సందిగ్దంలో పడిపోయారు నెటిజన్లు. చిప్పల ధరకి తోడు డెలివరీ ఛార్జీలు కూడా దాదాపు అంతే ఉండటంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని చెప్తున్నారు.
Advertisements
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో కూడా కొబ్బరి చిప్పల ధరలు రూ.150 నుంచి 300 దాకా ఉంచుతోంది. షైనింగ్ చేసిన చిప్పలు అంటూ ఈ కంపెనీ వీటిని అమ్ముతోంది. ఇదిగో ఈ చిప్పను చూడండి. రైతులు పైపైన పాలిష్ చేసిన 6 చిప్పలను రూ.999కి అమ్ముతోంది. ఒక్కో చిప్పలో 200 ఎం.ఎల్ ఆహారం పడుతుందనీ… ఈ చిప్పను గిన్నెలా వాడుకోవచ్చని ప్రాచారం చేస్తోంది ఈ కామర్స్ వెబ్ సైట్.