తూర్పుగోదావరి ప్రత్తిపాడు మండలం చింతలూరులో కింగ్ కోబ్రా అందర్నీ హడలెత్తించింది. పెద్దచెరువు వెనుక భాగంలోని తోటలో కనిపించింది. దాదాపు 14 అడుగుల పొడవులో ఉన్న దీన్ని చూసి జనం భయంతో వణికిపోయారు.
కొందరు వ్యక్తులు దూరం నుంచి తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పామును తమ గ్రామంలో చూడలేదంటున్నారు గ్రామస్తులు. అటవీ శాఖ అధికారులు ఈ భారీ కోబ్రాను పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని కోరుతున్నారు.