షూలు వేసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు చూసి వేసుకోవాలి. ఎందుకంటే వాటిలో తేళ్లు, జెర్రులు, పాములు వంటివి ఆవాసం చేసుకుని ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సరిగ్గా ఇక్కడ అలాంటి ఘటనే ఒకటి కర్నాటకలోని మైసూర్ లో చోటు చేసుకుంది.
షూలో ఏకంగా నాగుపాము ఒకటి హాయిగా పడుకుంది. అది తెలియని షూ తాలుకు వ్యక్తి దానిని వేసుకోవడానికి వెళ్లాడు. అయితే ఆ బూటులో పాము ఉందన్న విషయాన్ని అతను తెలుసుకున్నాడు.
వెంటనే పాములు పట్టే వ్యక్తికి తెలపగా.. అతను వచ్చాడు. పాములు పట్టేవాడు వచ్చి తన వద్ద ఉన్న హుక్‌తో షూను కదిలించాడు. ఆ సమయంలో షూలో చుట్టుకున్న ఆ విషసర్పం చాలా వేగంగా పడగ విప్పుతూ పైకి లేచింది.
అంతే ఒక్కసారిగా అందరి గుండెలు అదిరిపోయాయి. ఇదంతా వీడియో తీసి నెట్టింట్లో పెట్టారు. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అయ్యింది.
Shocking video of cobra #snake in Mysore, Karnataka hiding inside the shoe.
#ViralVideo #Cobra #Rescued #Shoes #Karnataka pic.twitter.com/rJmVN5W1ne— Bharathirajan (@bharathircc) October 10, 2022