కుక్కర్లో అన్నం మాత్రమే వండుకుంటారని తెలుసు. ఇక కొంతమంది కొన్నిసార్లు అయితే కొన్ని రకాల వంటలు కూడా చేసుకుంటారు. కానీ… కుక్కర్‌లో ఆవిరిని వాడుకొని… కాఫీ తయారుచెయ్యడం బహుశా ఎక్కడా చూసివుండరు.ఓ పెద్దాయన ఇలాంటి టెక్నిక్ ఫాలో అవుతున్నాడు. ఏదైనా వెరైటీగా చేస్తే… కచ్చితంగా దాని పట్ల ప్రజల్లో చాలా ఆసక్తి అనేది ఉంటుంది. కుక్కర్‌తో కాఫీ చేయడం కూడా అలాంటిదే. కాబట్టి.. ప్రజలు కూడా అలాంటి కాఫీ ఎలాంటి టేస్ట్ ఉంటుందో అని ట్రై చేస్తారు. మరి ఆ కాఫీ ఎలా తయారవుతోంది… కుక్కర్ ఆవిరితో ఎలా చేస్తున్నాడు… అది రుచి ఎలా ఉంది…అనేది తెలుసుకుందాం ఇప్పుడు..
ఇక ఈ వీడియోలో ఓ ముసలాయన ఓ గిన్నెలో ముందుగా పాలు పోసి ఇక ఆ తర్వాత కాఫీ పొడి వేస్తున్నాడు. తర్వాత పంచదార కూడా వేశాడు. ఆ మిశ్రమంలో చక్కెర ఇంకా కాఫీ పొడి పూర్తిగా కరిగిపోయేవరకూ కలియతిప్పాడు. తర్వాత కుక్కర్ ఆవిరితో దాన్ని వేడి చేశాడు. ఇక్కడ మరో విషయం మనం గమనించాలి. ఇక ఆ ఆ కుక్కర్‌కి ప్రత్యేకంగా ఓ గొట్టం లాంటిది ఏర్పాటు చేశాడు.
అందువల్ల … ఆ గొట్టానికి ఉన్న నట్టును లూజు చెయ్యగానే… కుక్కర్‌లోని ఆవిరి గొట్టం ద్వారా బయటకు వస్తోంది. అలా వచ్చే వేడి ఆవిరితో కాఫీ వేడెక్కి బుడగలు కూడా వస్తున్నాయి. ఆ కుక్కర్ లోపల నీరు ఉంటుంది. ఆ నీరే ఆవిరి రూపంలో కాఫీలో కలుస్తుంది. అలా ఈ కాఫీ తయారవుతోంది.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
.https://www.instagram.com/reel/CWGFHF3Itxr/?utm_medium=copy_link