చెన్నయ్: ఎవరి వృత్తి వారికి దైవ సమానం. వినాయకచవితి వస్తే పిల్లలు పుస్తకాలు, పెద్దోళ్లు డైరీలు స్వామివారి ముందు పెట్టి ప్రార్ధిస్తారు. దసరాకు వాహన పూజ చేస్తారు. మరి బర్త్‌డే వేడుకల్లో ఏంచేస్తారు? ప్రొఫెషనల్ కిల్లర్స్ కాస్త డిఫరెంటుగా సెలబ్రేషన్స్ చేయాలనుకుని అడ్డంగా బుక్కయిపోయారు. తమిళనాడులోని కోయంబత్తూరులో చేతిలో కత్తులు, కొడవళ్లు పట్టుకుని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఇద్దరు రౌడీలను పోలీసులు అరెస్టు చేశారు. పేరు మోసిన రౌడీలు తమ బర్డ్‌డే వేడుకల్లో వేట కొడవళ్లతో బర్త్‌డే కేక్‌లను కట్ చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఆమధ్య సేలం జిల్లాలో ఇలాగే వేట కొడవళ్లతో బర్త్‌డే ఫంక్షన్‌లో పాల్గొన్న రౌడీ జీసస్ సహా ఐదుగురికి పోలీసులు బేడీలు తగిలించారు. రీసెంటుగా చెన్నైలో బర్త్‌డే కేక్‌ను కట్ చేసిన పేరుమోసిన రౌడీ బినూ బుక్కయ్యాడు. ఇద్దరు రౌడీలు కత్తులను పట్టుకుని నడిరోడ్డులో కేక్ కట్ చేస్తున్న ఫోటోలు వాట్సప్, ఫేస్‌బుక్‌ల్లో బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను చూసి పోలీసులు రౌడీల్ని వేటాడారు. బర్త్‌డే పార్టీలో కత్తులతో కేక్‌ను కట్ చేసిన కోయంబత్తూరు శరవణంబట్టికి చెందిన సతీష్‌కుమార్, సుందర్ అరెస్టయి ఇప్పుడు కారాగారంలో వున్నారు. ఈ వేడుకల్లో పాల్గొని మారణాయుధాలతో వీరవిహారం చేసిన మరో తొమ్మిదిమంది ఆచూకీ కోసం కోయంబత్తూరు పోలీసులు వేటాడుతున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » తమిళనాడులో అంతే..!