దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ మధ్య గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా గబ్బర్ సింగ్ సినిమా ఇటీవల 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్ లో ఒక లెటర్ విడుదల చేశాడు. కానీ అందులో నిర్మాత బండ్ల గణేష్ పేరును పెట్టలేదు. దీనితో మొదలైన కోల్డ్ వార్ ఇంకా నడుస్తూనే ఉంది.
తాజాగా బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సమయంలో హరీష్ శంకర్ పేరు రాగానే.. ఇక పై అతనితో సినిమాలు చెయ్యనంటూ చెప్పుకొచ్చాడు. ఇక బండ్ల గణేష్ మాటలపై హరీష్ ఎలా స్పదిస్తాడు… అసలు ఎప్పుడు ఈ వార్ ముగుస్తుందంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరో వైపు పవన్ కలుగచేసుకుంటే గొడవ సర్దుమణిగే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.