సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలలోనే కాదు ప్రమోషన్స్‌లోనూ నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్నారు. అల్లుఅర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురంలో సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ చేసి… రికార్డ్స్ బ్రేక్ చేశాడు. మహేష్ టీజర్ రిలీజ్ చేసిన రోజే పోటీగా అల్లుఅర్జున్ మూడో సాంగ్ రిలీజ్ చేయటం విశేషం. ఇక ఇప్పుడు మరో సారి ఈ టాప్ హీరోలు పోటీకి సిద్ధం అవుతున్నారు.
డిసెంబర్ 1 న అల వైకుంఠపురంలో సినిమా టీజర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. అయితే అదే రోజు సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. దీనితో మరో మారు సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పోటీకి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. సంక్రాంతి బరిలో ఉన్న ఈ పందెం కోళ్లు ఎవరు గెలుస్తారో… చూడాలి.