నారాయణ పేట్ కలెక్టర్ హరిచందన లాక్ ఔట్ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బంది చర్యలు తీసుకుంటున్నారు.. నిత్యవసర సరుకులకోసం కూడా ప్రజలు బయటకు రావాల్సిన అవసరం లేదని తమకు ఏమి కావాల్సిన చిన్న msg చేస్తే మీ ఇంటికే పంపిస్తా అంటున్నారు. నిత్యావసరాల కోసం రోడ్డు మీదికి వస్తున్న ప్రజలు కరోన బారిన పడే అవకాసం ఉందని, అలాగే రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఎవరికి ఏ అవసరం ఉన్న వాట్సాప్ కు msg చేస్తే వాళ్లకు అవసరం ఉన్న సరుకులు ఇంటి దగ్గరకే పంపే ఏర్పాట్లు చేసినట్లు ఆమె చెప్పారు. కొన్ని మొబైల్ నెంబర్లు ఇచ్చి వాటికి ప్రజలు msg చేస్తే మొబైల్ వ్యాన్లలో వారి ఇంటికే చేరవేస్తాం అంటున్నారు.
నారాయణ పేట్ ప్రాంతం లో ఉండే వాళ్ళు..8790990730, ధన్వాడా ప్రాంతం లో ఉండేవాళ్ళు 8790990477, మక్తల్ ప్రాంతం వాళ్ళు 8790990603, నర్వా ప్రాంతం వాళ్ళు 8008555683, దామరిగిద్ద ప్రాంతం వాళ్ళు 7288855466, కృష్ణ ప్రాంతం వాళ్ళు 9391593511, ఊట్కూరు ప్రాంతం వాళ్ళు 8790990597, మరికల్ ప్రాంతం వాళ్ళు 8799099957, మగానూర్ ప్రాంతం వాళ్ళు 8790990553 నంబర్లకు సరుకుల జాబితా పంపిస్తే డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు ఉపయోగించుకొని లాక్ డౌన్ పాటించాలని కలెక్టర్ హరిచందన విజ్ఞప్తి చేశారు.